'లాక్ డౌన్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలి' - నిర్మల్ జిల్లా వార్తలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ అమలు తీరును ఇంఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని తెలిపారు.
sp
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో లాక్ డౌన్ తీరును ఇంఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ, కేసుల సంఖ్య పెరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ శాఖ, అత్యవసర సేవల విభాగాలు, లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉన్న వాళ్లు ఐడీ కార్డులు వెంట ఉంచుకోవాలన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని తెలిపారు.