అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిర్మల్ జిల్లా అటవీశాఖ అధికారి సుతాన్ అన్నారు. అటవీ శాఖ కార్యాలయంతో పాటు మామడ మండల కేంద్రంలోని కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో అమరువీరులైన అటవీ శాఖ సిబ్బంది చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'అటవీ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది' - నిర్మల్ లో జాతీయ అటవీ దినోత్సవం
నిర్మల్ జిల్లా అటవీ శాఖ కార్యాలయం, మామడ అటవీ కార్యాలయంలో జాతీయ అటవీ అమరుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సుతాన్ పాల్గొన్నారు.
'అటవీ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది'
సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి జైపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.