తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ నిషేధం వైపు నిర్మల్​ అడుగులు

ప్లాస్టిక్​ నిషేధంపై ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో 'ప్లాస్టిక్​ రహిత సమాజాన్ని నిర్మిద్దాం' అనే అంశంపై నిర్మల్​ జిల్లాలోని పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. ఈ సదస్సు ద్వారా ప్లాస్టిక్​ వినియోగాన్ని అంతమొందించే దిశగా చర్యలు చేపడతామన్నారు నిర్మల్​ జిల్లా ప్రభుత్వ యంత్రాగం.

ప్లాస్టిక్​ నిషేధం వైపు నిర్మల్​ అడుగులు

By

Published : Oct 2, 2019, 11:43 AM IST

'ప్లాస్టిక్​ రహిత సమాజాన్ని నిర్మిద్దాం' అనే అంశంపై నిర్మల్​లోని పురపాలక సంఘ కార్యాలయంలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. ఈ సదస్సులో నిర్మల్​ జిల్లా పాలనాధికారి​ ప్రశాంతి మాట్లాడుతూ... ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి తమ వెంట ఓ జూట్​ బ్యాగ్​, స్టీల్​ టీ కప్పును తీసుకెళ్లాలని సూచించారు . మార్పు మొదట మనతోనే మొదలవ్వాలని, ప్లాస్టిక్​ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నిబంధనలు మొదట నిర్మల్​ జిల్లాతోనే ప్రారంభమవ్వాలని, ఇవి ఇతరులకు స్ఫూర్తిగా మారాలని అన్నారు. రేపటి నుంచి నిత్యావసర సరుకుల కోసం ప్లాస్టిక్​కు బదులుగా ప్రత్యామ్నాయ సంచులను వాడాలన్నారు . రానున్న రోజుల్లో వ్యాపారస్తులకు ప్లాస్టిక్​ నిషేధంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్లాస్టిక్​ వాడకంపై జరిమానాలు సైతం విధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప పాలనాధికారి భాస్కరరావు, మున్సిపల్ ఇన్​ఛార్జి కమిషనర్ వెంకటేశ్వర్లుతో పాటు పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ప్లాస్టిక్​ సంచులకి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వమే సమకూర్చాలని అభిప్రాయపడ్డారు స్వచ్ఛంద సంస్థల సభ్యులు.

ప్లాస్టిక్​ నిషేధం వైపు నిర్మల్​ అడుగులు

ABOUT THE AUTHOR

...view details