నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్పేట్కు చెందిన బిరుదుల పద్మ అనే మహిళకు ఇటీవల డెంగ్యూ సోకింది. ఆమె జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. కాలనీకి చెందిన తెరాస నాయకులు ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్పేట్కు చెందిన బిరుదుల పద్మ కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్
మంత్రి బాధితురాలికి రూ. 40 వేల సీఎం సహాయనిధి మంజూరు చేయించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఇంద్రకరణ్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణాధ్యక్షులు మారుగొండ రాము పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కూతురి హత్య కేసులో తండ్రి, సవతితల్లి, మామకు యావజ్జీవం