ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతోనే కరోనా వ్యాధి నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. వలస కూలీలకు వసతి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
'అందుకే ఆదిలాబాద్లో ఒక్క కరోనా కేసూ నమోదవ్వలేదు' - lock down in nirmal
సామాజిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయొచ్చని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు.
!['అందుకే ఆదిలాబాద్లో ఒక్క కరోనా కేసూ నమోదవ్వలేదు' endoment minister indrakaran reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6598237-thumbnail-3x2-indra.jpg)
సామాజిక దూరం పాటించండి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ప్రతిఒక్కరూ ఇంటి వద్దే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సామాజిక దూరం పాటించాలన్నారు. నిర్మల్ జిల్లా పాలనాధికారి నేతృత్వంలో 75 మందికి సరిపడే క్వారంటైన్ ఏర్పాట్లు చేశామన్నారు. 15 ఇంటేన్సివ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సామాజిక దూరం పాటించండి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత