తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి అల్లోలకు మహాలక్ష్మి మట్టి ప్రతిమ అందజేత

నిర్మల్​ జిల్లా కేంద్రంలో దేవి, దేవతల ప్రతిమలు తయారు చేసే భీమేష్​... రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డికి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని అందజేశారు. మట్టి ప్రతిమ మూలవిరాట్​ను పోలి ఉందని భీమేష్​ను మంత్రి ప్రశంసించారు.

eco friendly statue of mahalkshmi given to minister indrakaran reddy
మంత్రి అల్లోలకు మహాలక్ష్మి మట్టి ప్రతిమ అందజేత

By

Published : Oct 26, 2020, 2:28 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రం అనంతపేట్​ గ్రామానికి చెందిన కళాకారుడు భీమేష్​.. దేవతల ప్రతిమలు తయారు చేస్తూ పలువురి మన్ననలు పొందారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నిర్మల్​ జిల్లా కేంద్రంలోని బంగల్​పేట మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని మట్టితో, సహజ రంగులతో తయారు చేశాడు. ఆ ప్రతిమను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డికి అందజేశారు.

మట్టి ప్రతిమ మూలవిరాట్​ను పోలి ఉందని కళాకారుడు భీమేష్​ను మంత్రి అల్లోల ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ గండ్రత్​ ఈశ్వర్​, తెరాస పార్టీ పట్టణాధ్యక్షులు రాము తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిఃకన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం

ABOUT THE AUTHOR

...view details