ప్లాస్టిక్ రహిత సమాజానికి నేను సైతం అంటూ వినూత్న రీతిలో ముందుకొచ్చాడు నిర్మల్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త. నార్లపురం రవీందర్ అనే వ్యాపారవేత్త తన సోదరుని కుమారుని పెళ్లి ఆహ్వాన పత్రికను జనప సంచిపై ముద్రించి బంధువులకు అందజేస్తున్నారు.
జనప సంచిపై పెళ్లిపత్రిక - eco friendly invitaion cards in nirmal
శుభకార్యాలకు తమ హోదాకు తగ్గట్లు రంగురంగుల ఆహ్వారపత్రికలు ముద్రించి ఇవ్వడం సాధారణం. కానీ నిర్మల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన సోదరుడి కుమారుడి వివాహ శుభలేఖను జనప సంచిపై ముద్రించి బంధువులు, మిత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు.
జనప సంచిపై పెళ్లిపత్రిక
పెళ్లికి రావాలన్న ఆహ్వానంతో పాటు... ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్న సందేశాన్నిస్తున్నారు. తాను చేసే ఈ ప్రయత్నంతో కొంత మందిలో మార్పు వచ్చినా ఎంతో సంతోషంగా ఉంటుందని రవీందర్ తెలిపారు.
- ఇదీ చూడండి : "సమస్యలపై పోరాడితే అక్రమ కేసులతో వేధిస్తున్నారు"
TAGGED:
పర్యావరణ హిత ఆహ్వాన పత్రికలు