తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​ కలెక్టరేట్​లో 'ఈ ఆఫీస్‌' విధానం - నిర్మల్​లో ఈ-ఆఫీస్‌ పాలనా విధానం అమలు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి కాగితాలకు బైబై చెప్పేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిర్మల్​ కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఆదేశాలతో కలెక్టరేట్​లో ఈ ఆఫీస్​ విధానాన్ని అమలు చేస్తున్నారు.

E_OFFICE POLICY IMPLEMENTED IN NIRMAL ADMINISTRATION
E_OFFICE POLICY IMPLEMENTED IN NIRMAL ADMINISTRATION

By

Published : Feb 17, 2020, 9:41 PM IST

నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ పాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితరహిత సేవలు కొనసాగించాలని కలెక్టర్​ ఆదేశించగా... నేటి నుంచే ఈ-ఆఫీస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రజావాణిలో భాగంగా అర్జీదారులు ఇచ్చే ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఎండాకాలం కావటం వల్ల అర్జీల సమర్పణకు వచ్చేవారికి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. ఆవరణలో ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీలు వేశారు.

ఆయా శాఖల వారీగా అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసుకొని ఆన్‌లైన్‌ విధానంలోనే అర్జీలను నమోదు చేస్తున్నారు. కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల్లోనూ కంప్యూటర్‌ ఆధారితంగా సేవలు కొనసాగనున్నాయి. వీలైనంత వరకు కాగితాలేవీ వినియోగించకుండా పారదర్శకంగా, వేగంగా, సులభంగా ప్రజలకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు.

నిర్మల్​లో ఈ-ఆఫీస్‌ పాలనా విధానం అమలు

ఇవీ చూడండి:ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details