తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా దుర్గామాత శోభాయాత్ర - Durgamata Immersion at bhainsa in nirmal district

భైంసాలో దుర్గామాత నిమజ్జన వేడుక ఘనంగా జరిగింది. నవరాత్రులు అమ్మవారికి విశేష పూజలు చేసిన పట్టణవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Durgamata Immersion at bhainsa in nirmal district
కన్నుల పండువగా దుర్గామాత శోభాయాత్ర

By

Published : Oct 26, 2020, 3:31 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుర్గామాత నిమజ్జన వేడుక కన్నుల పండువగా సాగింది. పట్టణంలోని ఆర్​ అండ్​ బీ భవనం ఎదుట ప్రతిష్టించిన దుర్గామాతకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి.. శోభాయాత్రను ప్రారంభించారు.

నవరాత్రుల్లో భక్తులచే విశేష పూజలందుకున్న అమ్మవారికి పట్టణవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సందర్భంగా పోతురాజుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది.

ఇదీ చూడండి.. షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... బాలుడి మృతి

ABOUT THE AUTHOR

...view details