డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకై మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తామని నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలో 1,460 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలో ఇళ్ల కొరకు లబ్ధిదారుల నుంచి వార్డుల వారీగా దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. అమాయక ప్రజలను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని వివరించారు.
'అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు' - డబుల్ బెడ్ రూం ఇళ్లపై నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలో 1,460 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని పేర్కొన్నారు మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్.
అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు
దరఖాస్తులను పరిశీలించి దారిద్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తామన్నారు. ఎవరు ఇతరులను నమ్మి మోసపోయి డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ లేని విధంగా నిర్మల్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తయ్యాయని తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వివరించారు.