నిర్మల్ జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే యువతీ యువకులు, చిన్నారులు రంగుల పొట్లాలతో సంబురాలు చేసుకున్నారు. వీధుల్లో సంచరిస్తూ ఒకరిపై ఒకరు రంగునీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా గంతులు వేశారు.
హోలీ వేడుకల్లో డీజే సంబురాలు - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
నిర్మల్లో హోలీ సంబురాలు సంతోషంగా చేసుకున్నారు. చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు అందరూ కలసి ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు.
హోలీ వేడుకల్లో డీజే సంబురాలు
హోలీ రంగుల కేళి అంటూ చిందులు వేశారు. డీజే పాటలతో నృత్యాలు చేశారు. చిన్న,పెద్దా తేడా లేకుండా రంగులు పూసుకుంటూ సంతోషంగా గడిపారు.
ఇదీ చూడండి :రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న హోలీ వేడుకలు