వనపర్తి పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును ఎస్పీ అపూర్వ రావు పరిశీలించారు. వివేకానంద చౌరస్తా, రాజీవ్ చౌరస్తా, బస్టాండ్, రామాలయం, కొత్తకోట, ఆత్మకూరులో ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ - నిర్మల్ ఎస్పీ వార్తలు
కొవిడ్ కట్టడికి అవిరామంగా పనిచేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరు సహకరించాలని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావు సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించని 658 మందిపై కేసులు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లా వార్తలు
అత్యవసరంమైతే తప్ప బయటకి రావొద్దని సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. కొవిడ్ కాలంలో ప్రజారోగ్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసులకు సహకరించాలని సూచించారు. జిల్లాలో లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 658 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ కిరణ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
ఇదీ చూడండి:ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. పీపీఈ కిట్ల పేరుతో పీల్చిపిప్పి