బాసరలో బ్రహ్మమి తీర్థ ప్రసాద వేడుక జరిగింది. గత 23 ఏళ్లుగా జరుగుతున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది.
బాసరలో బ్రహ్మమి తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు
By
Published : Feb 18, 2019, 1:27 PM IST
బాసరలో బ్రహమ్మి తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు.
బాసర గోదావరి తీరాన ధర్మవర్ధిని వ్యవస్థాపకులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులకు బ్రహమ్మి తీర్థ ప్రసాద వితరణ చేశారు. బాసర క్షేత్రంలో ప్రతీ మాఘ మాసంలో గత 23 ఏళ్లుగా ఈ వితరణ చేస్తున్నారు. ఈ తీర్థాన్ని సేవిస్తే పిల్లలు విద్యాబుద్ధుల్లో చురుకుగా రాణిస్తారని భక్తుల విశ్వాసం. ఈ వేడుక కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం నైమిశారణ్య యాగశాలలో సరస్వతి యాగం నిర్వహించారు.