కరోనా కష్టకాలంలోనూ పేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి సర్పంచ్ ఇప్ప రవీందర్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరఫున కానుకలను ఆదివారం అందజేశారు.
బీరవెల్లిలో రంజాన్ కానుకలు పంపిణీ - తెలంగాణ వార్తలు
నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చే రంజాన్ కానుకలను సర్పంచ్ రవీందర్ రెడ్డి పంపిణీ చేశారు. పేద ముస్లింలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ముస్లింల కోసం ఏటా రంజాన్ కానుకలు పంపిణీ చేయడం హర్షణీయమని కొనియాడారు.
బీరవెల్లిలో రంజాన్ కానుకలు పంపిణీ, రంజాన్ బహుమతులు
ముస్లింల కోసం ఏటా రంజాన్ కానుకలు పంపిణీ చేయడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్కడి కరుణ సాగర్ రెడ్డి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహబూబ్ ఖాన్, అబ్దుల్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:బ్యాంక్ ఉద్యోగులపై కరోనా పంజా.. పనివేళలు కుదించాలని విజ్ఞప్తి