శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి ఏటా ఏప్రిల్ 14న విషు పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలోనూ గత 10 సంవత్సరాలుగా అయ్యప్ప విషు పూజ, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు.
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - latest news on Distribution of food under the direction of Ayyappa Seva Samiti
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే విషు పూజను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలకు ఆహారం పంపిణీ చేశారు.
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ
లాక్‌డౌన్ దృష్ట్యా భక్తులెవరినీ ఆలయాల్లోకి అనుమతించకపోవడం వల్ల స్వామివారికి నిర్వహించాల్సిన విషు పూజ, పడి పూజలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ కూడళ్లలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు పులిహోర ప్యాకెట్లను అందజేశారు.
ఇదీ చూడండి:-'లాక్‌డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'