Basara IIIT News: నిర్మల్ జిల్లా బాసర త్రిపుల్ ఐటీలో శనివారం నుంచి విద్యార్థులకు పెట్టె ఆహారంలో రెండు సార్లు కీటకాలు వచ్చిన ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకసారి కప్ప, మరోసారి తోకపురుగు రావడంతో తెలుసుకునేందుకు వచ్చిన మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఆర్జీయూకేటీలోకి వెళ్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. వారి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎంతకీ లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రధాన ద్వారం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
'నాయకులమైన తమను, మీడియానూ ఎందుకు క్యాంపస్ లోపలికి అనుమతించడం లేదో కారణాలు చెప్పాలి. ప్రజాప్రతినిధులమైన మమ్మల్ని లోపలికి ఎందుకు అనుమతించడం లేదు?. విద్యార్థుల బాగోగుల గురుంచి ఆరా తీసే అధికారం తమకూ ఉంటుంది. తెరాస ప్రభుత్వాన్ని అవమానపరిచేటట్టు ఆర్జీయూకేటీ అధికారులు చేస్తున్నారు.'