తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేరాల నియంత్రణ కొరకే నిర్బంధ తనిఖీలు' - latest news on nirmal sp

నిర్మల్​ జిల్లా కిష్టాపూర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నారు.

Detention checks for crime control
'నేరాల నియంత్రణ కొరకే నిర్బంధ తనిఖీలు'

By

Published : Feb 13, 2020, 1:46 PM IST

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కిష్టాపూర్​లో ఎస్పీ శశిధర్​రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 1 ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నారు.

శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడం, నేరాల నియంత్రణ కొరకే ఈ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నేర నివారణ చర్యల్లో భాగంగా అందరూ కలిసి గ్రామంలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

అత్యవసర సమయంలో డయల్ 100 సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు.

'నేరాల నియంత్రణ కొరకే నిర్బంధ తనిఖీలు'

పూర్తి సమాచారం:పనివాళ్లుగా చేరారు... ఇళ్లను కొల్లగొట్టారు...

ABOUT THE AUTHOR

...view details