తెలంగాణ

telangana

ETV Bharat / state

వినాయక శోభయాత్రలో అపశృతి - nirmal

గణేశ్​ శోభయాత్ర జరుగుతున్న సమయంలో ఓ యువకుడికి విద్యత్​ వైర్లు తగిలి మృతి చెందిన ఘటన నిర్మల్​ జిల్లా భైంసాలో జరిగింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ హిందు ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఆందోళకారులతో మాట్లాడుతున్న జేసీ

By

Published : Sep 11, 2019, 9:34 AM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన శోభయాత్రలో అపశృతి చోటుచేసుకుంది, గణేశుల ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు తగిలి యువకుడు శంకర్ మృతి చెందారు. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే యవకుడు మరణించాడని హిందు ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. జాయింట్ కలెక్టర్ రాకతో ధర్నా విరమించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరుఫున 5 లక్షల రూపాయలతో పాటు, కుటుంబంలో ఒకరికి తాత్కాలిక ఉద్యోగం ఇస్తామని జేసీ చెప్పారు. విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వినాయక శోభయాత్రలో అపశృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details