నిర్మల్ జిల్లాలో వేసవి తాపం ఒకరిని బలితీసుకుంది. కుభీర్ మండలం సావ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లింగి గ్రామానికి చెందిన గదేకర్ సాగర్ బాయి వడదెబ్బ వల్ల ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలో మట్టి కట్టల పని చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయినట్లు తోటి కూలీలు వెల్లడించారు.
వడ దెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి - నిర్మల్ జిల్లాలో వడ దెబ్బ వల్ల.. ఉపాధి హామీ కూలీ మృతి
ఉపాధి హామీ పనుల్లో విషాదం చోటు చేసుకుంది. కుభీర్ మండలం లింగి గ్రామానికి చెందిన సాగర్ బాయి అనే మహిళ వడదెబ్బ వల్ల మృతి చెందింది. మట్టి కట్టల పని చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయినట్లు తోటి కూలీలు వెల్లడించారు.

వడ దెబ్బ వల్ల.. ఉపాధి హామీ కూలీ మృతి
సాగర్ బాయిని వెంటనే భైంసాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:పోతిరెడ్డిపాడుపై కోమటిరెడ్డి వర్సెస్ కర్నె ప్రభాకర్