నిర్మల్ జిల్లా కౌఠ గ్రామానికి చెందిన మంజూష దౌర్జన్యాలపై ఆమె తల్లిదండ్రులు బాసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికి రెండు రోజుల ముందు మంజుష.. తాను ప్రేమించిన రాజుతో పారిపోయినట్టు గత నెల ఆమె తల్లిదండ్రులు బాసర పోలీసులను ఆశ్రయించారు.
శనివారం రాజు, అతని తండ్రి మాధవరావ్లతో కలిసి మంజుష తన పుట్టింటికి వచ్చి ఆస్తి విషయంలో గొడవకు దిగింది. ఈ క్రమంలో తన తల్లితో పాటు చెల్లెల్ని గాయపరిచింది. తమను కాదని వెళ్లిపోయిన మంజుష వారి అండ చూసుకుని తమపై దాడి చేసిందని తల్లిదండ్రులు వాపోయారు.