నిర్మల్ జిల్లాకేంద్రంలో దత్త సాయి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. సాయి దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో సాయి పల్లకి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. సాయినాథునికి ప్రత్యేక పూజలు జరిపి... అనంతరం బాబా చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో పురవీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి బాబాను దర్శించుకున్నారు.
ఘనంగా దత్తసాయి జయంతి ఉత్సవాలు - తెలంగాణ తాజా వార్తలు
నిర్మల్ జిల్లాకేంద్రంలో సాయి పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయినాథునికి ప్రత్యేక పూజలు చేసి పుర వీధుల గుండా ఊరేగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఘనంగా దత్తసాయి జయంతి ఉత్సవాలు
మధ్యాహ్న హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, సాయి మాలధారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మైదానంలో ఉల్లిగడ్డలు పండిస్తూ రైతుల నిరసన