విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు గురుకుల పాఠశాలల నిర్మల్ జిల్లా సమన్వయ అధికారి సరస్వతి తెలిపారు. 'మన ఊరికి- మన గురుకులం' కార్యక్రమంలో భాగంగా సోన్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.
'విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే పోటీలు'
విద్యార్థులు చదువులో నైపుణ్యం పెంపొందించుకోవాలని గురుకుల పాఠశాలల నిర్మల్ జిల్లా సమన్వయ అధికారి సరస్వతి అన్నారు. 'మన ఊరికి మన గురుకులం' కార్యక్రమంలో భాగంగా సోన్ మండల కేంద్రంలో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.
'విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే పోటీలు'
పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతితో పాటు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోద్ కుమార్, ఉపసర్పంచ్ రాజేశ్వర్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.