తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన - protest against sarpanch husband latest News

నిర్మల్ జిల్లా కడెం మండలం బుట్టాపూర్ గ్రామ సర్పంచ్ భర్త అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంపై సీపీఐ (ఎం), గ్రామ కమిటీ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాయి. భార్య స్థానంలో భర్త సర్పంచ్​గా చెలామణి అవుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావడంపై పాలనాధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

సర్పంచ్ భర్తపై చర్యలు కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన
సర్పంచ్ భర్తపై చర్యలు కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన

By

Published : Sep 19, 2020, 8:42 AM IST

నిర్మల్ జిల్లా కడెం మండలం బుట్టాపూర్ గ్రామ సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ (ఎం), గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భార్య స్థానంలో భర్త సర్పంచ్​గా చెలామణి అవుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొమ్మెన సురేష్ మండిపడ్డారు. నిలదీసిన వారిపై సర్పంచ్ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఫిర్యాదుపై నిర్లక్ష్యం..

కలెక్టర్ కార్యాలయంలో గతంలోనే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే సర్పంచ్ భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు వెంకటేశ్, తిరుపతి, బద్దయ్య, బుచ్చయ్య, రాజన్న, వినోద్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details