తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్లాక్​ డేను నిర్వహించిన సీపీఐఎంఎల్​ న్యూ డెమోక్రసీ

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ.. నిర్మల్​ జిల్లా కేంద్రంలో సీపీఐఎంఎల్​ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు బ్లాక్​ డేను నిర్వహించింది. అందులో భాగంగానే నల్ల జెండాను ఎగురవేశారు.

CPIML New Democracy organized Black Day
బ్లాక్​ డేను నిర్వహించిన సీపీఐఎంఎల్​ న్యూ డెమోక్రసీ

By

Published : May 26, 2021, 4:14 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో సీపీఐఎంఎల్​ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు నల్ల జెండా ఎగురవేశారు. రైతుసంఘాల సమాఖ్య పిలుపు మేరకు బ్లాక్​ డే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని దిల్లీను ముట్టడించి ఆరు నెలలు గడుస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని జిల్లా కార్యదర్శి రాజన్న తెలిపారు.

రైతాంగ రక్షణ కోసం, ప్రజల ఆహార భద్రత రక్షణ కోసం రైతాంగ ఉద్యమం కొనసాగుతోందని ఆయన తెలిపారు. పార్లమెంట్​లో అనుసరించాల్సిన పద్ధతులు పాటించకుండా.. ప్రతిపక్షం లేనప్పుడు ఆమోదించుకొని, అమలుకు పూనుకోవడం సిగ్గుచేటని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details