పోడు భూములకు పట్టాలిస్తామన్న హామీని సీఎం నెరవేర్చాలని నిర్మల్ జిల్లా సీపీఐ కార్యదర్శి విలాస్ కోరారు. గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ, గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఎనభై ఏళ్లుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
గిరిజనులకు భూహక్కులు కల్పించాలంటూ సీపీఐ ధర్నా
గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని నిర్మల్ జిల్లా సీపీఐ కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. భూమిలేని వారికి మూడు ఎకరాలు కేటాయించాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అటవీ హక్కుల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు.
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి.. భూమిలేని గిరిజనులకు మూడెకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులు వారిపై ఎలాంటి కేసులు పెట్టకూడదని కోరారు. ఆదివాసీలుండే ప్రాంతాలకు సాగునీరు, మంచినీటి సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణ, కుంటాల రాములు, శంకర్,లక్ష్మణ్, గిరిజన సమాఖ్య నాయకులు మెస్రం కాంతారావు, వెడమ లక్ష్మణ్, తుకారాం, తొడసం పాండు, గిరిజాబాయి, గెడం జారూబాయి, లచ్చుబాయి, అమృత్ రావు, వంద మంది గిరిజనులు పాల్గొన్నారు.