తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ కొవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకోవాలి' - తెలంగాణ తాజా వార్తలు

ప్రతి ఒక్కరూ కొవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకోవాలని కేంద్ర విత్తన పరిశోధన సంస్థ పాలకమండలి సభ్యుడు అయ్యన్నగారి భూమయ్య అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నటరాజ్​నగర్ ఉమామహేశ్వర ఆలయంలో కరోనా నివారణ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

తెలంగాణ కరోనా వార్తలు
నిర్మల్​ కరోనా వార్తలు

By

Published : Apr 26, 2021, 12:59 PM IST

కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్ర విత్తన పరిశోధన సంస్థ పాలకమండలి సభ్యుడు అయ్యన్నగారి భూమయ్య అన్నారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని నటరాజ్​నగర్​లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్​ కేంద్రంలో ఆయన టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్​పై అపోహలు విడనాడాలని కోరారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details