MIM MLA Akbaruddin: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారన్న కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషిగా తేల్చింది. కేసులకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేనందున కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇకముందు ఇలాంటి ప్రసంగాలు చేయకుండా చూడాలని అక్బర్ తరఫు న్యాయవాదిని అజీమ్‌ను న్యాయమూర్తి హెచ్చరించారు. నిర్దోషిగా తేల్చినంత మాత్రాన సంబురాలు చేసుకునే సమయం కాదిదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
MIM MLA Akbaruddin: అక్బరుద్దీన్ నిర్దోషి.. తేల్చిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం
MIM MLA Akbaruddin: విద్వేషపూరిత ప్రసంగం చేశారని నమోదైన కేసుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ని నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే.. 2012 డిసెంబర్ 8న నిజామాబాద్‌లో, అదే ఏడాది 22న నిర్మల్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. 2013 జనవరి 2న నిర్మల్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. నిజామాబాద్‌లో నమోదైన కేసును అప్పటి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. నిర్మల్ పోలీసులు అక్బరుద్దీన్‌ను 2013 జనవరి 8వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఫిబ్రవరి 16వ తేదీన బెయిల్‌పై విడుదలై బయటికి వచ్చారు. ఈ కేసులను వేర్వేరుగా దర్యాప్తు చేపట్టిన నిర్మల్ పోలీసులు, సీఐడీ అధికారులు 2016లో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. నిజామాబాద్‌లో అక్బరుద్దీన్ ప్రసంగాన్ని సీఐడీ అధికారులు చండీగడ్ లోని సీఎఫ్ఎస్ఎల్కు పంపారు. విద్వేషపూరిత ప్రసంగంలో ఉన్నది అక్బరుద్దీన్ గొంతేనని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చింది. ఈ నివేదికను సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. నిర్మల్ పోలీసులు నమోదు చేసిన కేసులో న్యాయస్థానం 30మందికి పైగా విచారించింది. సీఐడీ కేసులో 43మందిని విచారించారు. రెండు కేసుల్లోనూ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయమూర్తి కేసులను కొట్టేశారు.
ఇవీ చదవండి: