నిర్మల్ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో జిల్లాలోని ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని కొవిడ్-19 జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడ్డ వారి సంఖ్య 76కి చేరింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి బారినపడి ఓ వృద్దురాలు శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కరోనా బారినపడి నలుగురు మరణించారు.
నిర్మల్ జిల్లాలో మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ - కరోనా మహమ్మారి
నిర్మల్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు నమోదు కావడం వల్ల జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
నిర్మల్ జిల్లాలో మరో ఏడుగురికి కరోనా పాజిటివ్
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 1089 మంది రక్త నమూనాలు సేకరించినట్టు పేర్కొన్నారు. వీటిలో 26 యాక్టివ్ కేసులుండగా, ఐదుగురు ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. హోంక్వారంటైన్లో 21 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా కేసులు నమోదు కావడం వల్ల జిల్లా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: 'ప్రయివేటు ఆసుపత్రులు ఎందుకు? సర్కారు అండగా ఉంటుంది'