నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కరోనా నియంత్రణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కరోనా కేసులు పెరిగిపోతున్నాయని తెలిసి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన నూతన భవన గదుల వేలం పాటలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా వేలం పాట నిర్వహించారు.
భౌతిక దూరం మరిచి.. కరోనా నిబంధనలు తుంగలో తొక్కి.. - corona rules violation in bhynsa
కరోనాపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించాల్సిన అధికారులే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో నిబంధనలను పాటించేలా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించిన సంఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది.
![భౌతిక దూరం మరిచి.. కరోనా నిబంధనలు తుంగలో తొక్కి.. corona rules violation in nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8635069-396-8635069-1598938460972.jpg)
కరోనా నిబంధనలను తుంగలో తొక్కుతున్న అధికారులు
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటే అధికారులు మాత్రం బహిరంగ వేలం పాట నిర్వహించారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బహిరంగ వేలం పాటలో 44 గదులకు సంబంధించి 526 దరఖాస్తులు రావడం వల్ల అందరూ వేలం పాటలో పాల్గొన్నారు. అధికారులు, దరఖాస్తు దారులు భౌతిక దూరం పాటించకుండా వేలం పాట నిర్వహించారు.