నిర్మల్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లాను గ్రీన్ జోన్ ప్రకటించిన తర్వాత ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముంబైలో పని చేస్తూ స్వస్థలాలకు వచ్చిన ఐదుగురిలో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. నిర్మల్ పట్టణానికి చెందిన ఒకరు, ఖానాపూర్ మండలంలోని గోడలపంపు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా సోకింది.
నిర్మల్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ - Corona positive cases in Telangana state
నిర్మల్ జిల్లాలో తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలే కావడం గమనార్హం. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వచ్చిన ఐదుగురిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.

నిర్మల్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్
దీనివల్ల వెంటనే వారిని చికిత్స కోసం వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులతోపాటు ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారిని అధికారులు గుర్తించి హోంక్వారంటైన్‌కు తరలించారు.