తెలంగాణ

telangana

ETV Bharat / state

పుచ్చకాయ రైతులను దెబ్బతీసిన కరోనా

కరోనా వైరస్​ పుచ్చకాయ రైతులను దెబ్బ తీసింది. అనుకున్నంతగా పంట వచ్చిందని ఆనందపడ్డ రైతులకు కొవిడ్​-19 తీవ్ర నిరాశను మిగిల్చింది. పుచ్చకాయలను విక్రయించాలనుకున్న వారికి.. లాక్‌డౌన్​తో పెద్ద ఆటంకం ఏర్పడింది. కర్ఫ్యూతో వ్యాపారులు మందుకు రాకపోవడం, రైతులే నేరుగా తీసుకుపోదామన్న వాహనాలు దొరక్కపోవడం వల్ల పుచ్చకాయలు నేలపాలవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

పుచ్చకాయ రైతులకు కరోనా దెబ్బ.. లాక్‌డౌన్​తో నేలపాలు
పుచ్చకాయ రైతులకు కరోనా దెబ్బ.. లాక్‌డౌన్​తో నేలపాలు

By

Published : Mar 27, 2020, 7:05 PM IST

Updated : Mar 27, 2020, 8:07 PM IST

నిర్మల్ జిల్లాలో పుచ్చకాయ పంట చేతికి వచ్చింది. పంటను విక్రయించాలనుకున్న సమయంలో కరోనా వైరస్ రైతులను దెబ్బ తీసింది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్​తో వ్యాపారులు ముందుకు రాకపోవడం, రైతులు నేరుగా తీసుకుపోదామన్న వాహనాలు దొరక్కపోవడం వల్ల పొలాల్లో పుచ్చకాయలు కుళ్లిపోతున్నాయి.

జిల్లాలో పుచ్చకాయ పంటను వంద మంది రైతులు 350 ఎకరాల్లో సాగు చేశారు. పండించిన పంటను ప్రతి సంవత్సరం నిజామాబాద్, హైదరాబాద్ నుంచే గాక మహారాష్ట్ర నుంచి వచ్చి వ్యాపారులు కొనుగోలు చేసే వారు. కొందరు రైతులు నేరుగా వాహనాల్లో తీసుకెళ్లి విక్రయించేవారు. ఈసారి మహారాష్ట్ర సరిహద్దులు మూసి వేయడం, మనదగ్గర ఆంక్షలు విధించినందున వ్యాపారులు ముందుకు రావడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి పండించిన పుచ్చకాయలను ప్రభుత్వ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

పుచ్చకాయ రైతులకు కరోనా దెబ్బ.. లాక్‌డౌన్​తో నేలపాలు

ఇవీ చూడండి:వసతిగృహాలను తెరిచే ఉంచుతాం: నిర్వాహకులు

Last Updated : Mar 27, 2020, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details