కరోనాతో ఎన్నో కుటుంబాలు ఇంటి యజమానిని కోల్పోతున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నాయి. మహమ్మారికి ఇంట్లో సంపాదించే ఒక్కరూ బలైపోతే.. ఆ కుటుంబం పూటగడవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న ఓ మహిళకు తన భర్త స్నేహితులు చేయూతనందించారు.
Friends Help: కొవిడ్ మృతుడి కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సాయం - corona cases in nirmal district
కరోనాతో ప్రతిరోజు ఎంతో మంది మృతి చెందుతున్నారు. కొందరు కుటుంబ పెద్దను కోల్పోయి వీధిన పడుతున్నారు. అలా మహమ్మారి బారిన పడి యజమానిని కోల్పోయిన ఓ కుటుంబానికి మృతుని మిత్రబృందం ఆర్థిక సాయం అందించింది. ఆపదలో తామున్నామని ఓ భరోసానిచ్చింది.
నిర్మల్ జిల్లా వార్తలు, కొవిడ్ మృతుని కుటుంబానికి స్నేహితుల సాయం, నిర్మల్ జిల్లాలో కరోనా మరణాలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ టీచర్ కరోనా బారిన పడి మృతి చెందాడు. ఉన్న పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి మృతుని మిత్ర బృందం ఆర్థిక సాయం చేసింది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మృతుని స్నేహితులతో మాట్లాడి విరాళాలు సేకరించింది. అందరూ కలిసి మొత్తం రూ.6,50,600లు పోగు చేసి ఆ కుటుంబానికి అందజేశారు.