నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని చింతకుంట తండాలో కరోనా వైరస్ ప్రబలకుండా.. ఇంటి గుమ్మాలకు గ్రామస్థులు ముడుపులు కట్టారు. తండాలో 60 కుటుంబాలు నివసిస్తుండగా... ప్రతి ఇంటికి ముడుపులు కట్టారు. ఇంటి ముందు కులదేవతలను ప్రార్థించి.. పూజలు చేస్తూ పాటలు పాడారు. మహమ్మారి తమ గ్రామానికి రావొద్దని.. ప్రజలంతా.. సుఖశాంతులతో గ్రామస్థులు ఉండాలని ప్రార్థించారు.
కరోనా రాకుండా ఉండటానికి ఆ ఊళ్లో ఏం చేశారో తెలుసా? - corona virus updates
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరపెడుతోంది. ఈ మహమ్మారి తమ తండాకు రావొద్దంటూ.. ఇంటింటికి ముడుపులు కట్టుకున్నారు నిర్మల్ జిల్లాలోని ఓ తండా వాసులు.
![కరోనా రాకుండా ఉండటానికి ఆ ఊళ్లో ఏం చేశారో తెలుసా? corona virus updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6519868-974-6519868-1584977911496.jpg)
కరోనా రావొద్దంటూ.. ఇంటింటికి ముడుపులు