తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలల్లో కరోనా.. తల్లిదండ్రుల ఆందోళన - Parents are tension

రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా నిర్మల్​ జిల్లా ముధోల్లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్ వచ్చింది.

Corona cases in schools Parents are tension
పాఠశాలల్లో కరోనా.. తల్లిదండ్రుల ఆందోళన

By

Published : Mar 20, 2021, 5:46 PM IST

నిర్మల్ జిల్లా ముధోల్లోని రాష్ట్ర గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయునికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మంది విద్యార్థినిలకు పాజిటివ్ అని నిర్ధరణ అయింది.

అటు భైంసాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. గురుకుల కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిపి 31 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇవాళ ఐదుగురికి కొవిడ్​ పాజిటివ్ వచ్చింది. పాఠశాలల్లో కరోనా కలకలం రేపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలని ఇంటికి తీసుకెళ్తున్నారు.

ఇదీ చూడండి :అనిశా వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్​

ABOUT THE AUTHOR

...view details