నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం గుండంపల్లి రైతులు ఆందోళనకు దిగారు. 61వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.
మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు - corona effct
మొక్కజొన్న రైతులకు తిప్పలు తప్పటం లేదు. నిర్మల్ జిల్లాలో రోజూ ఏదో ఓ ప్రాంతంలో రైతులు రోడ్డెక్కుతున్నారు. నర్సాపూర్(జి) మండలం గుండంపల్లి రైతులు ఆందోళన నిర్వహించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించి... మిగిలిన రైతుల మొక్కజొన్నను కొనాలని డిమాండ్ చేశారు.
మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు
ధాన్యం కేంద్రంలోనే ఉండటం వల్ల మిగితా రైతుల మొక్కజొన్న కొనుగోలుకు జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికే వాతావరణ మార్పులతో మొక్కజొన్నను కాపాడుకోడానికి తీవ్ర సమస్యలు తలెత్తుతుండగా... కొనుగోలులో జాప్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పగా... రైతులు ఆందోళన విరమించారు.