జఫ్రాపూర్లో పోలీసుల కట్టడి ముట్టడి - cordon search at jaafrapur in nirmal district
నిర్మల్ జిల్లా సోన్ మండలం జఫ్రాపూర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
జఫ్రాపూర్లో పోలీసుల కట్టడి ముట్టడి
శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా నిర్మల్ జిల్లా సోన్ మండలం జఫ్రాపూర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 94 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచి 10 వేల రూపాయల విలువైన మద్యం, వేయి రూపాయలు విలువ చేసే గుట్కాను స్వాధీనపరుచుకున్నారు.
- ఇదీ చూడండి : ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉమర్ జలీల్