నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూర్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు. 2ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు.
'ప్రజాసమస్యల పరిష్కారం కోసమే నిర్బంధ తనిఖీలు' - corden search
నిర్మల్ జిల్లా కల్లూర్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, 2ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
'ప్రజాసమస్యల పరిష్కారం కోసమే నిర్బంధ తనిఖీలు'
ప్రజల్లో మమేకమై ప్రజాసమస్యలు తీర్చేందుకు జిల్లాలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. సోదాలు చేసే విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని తెలిపారు.
ఇవీ చూడండి:పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..