నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామపంచాయతీలో సర్పంచ్‌ను వార్డు సభ్యులు నిలదీశారు. ఇవాళ గ్రామ పంచాయతీలో సర్వసభ్య సమావేశం జరిగింది. సర్పంచ్, వార్డు సభ్యులు తదితర అధికారులు హాజరయ్యారు.
ముథోల్ గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో వాగ్వాదం - ముధోల్ గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో వాగ్వాదం
ముధోల్ గ్రామపంచాయతీలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది. వార్డు మెంబర్లు సర్పంచ్‌ను ఆదాయం లెక్కలపై ప్రశ్నించారు.

ముధోల్ గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో వాగ్వాదం
ఈ సమావేశంలో కొందరు వార్డు సభ్యులు.. పలు అభివృద్ధి పనులు, మొరం అమ్మకాలపై వచ్చిన ఆదాయం లెక్కలను ప్రశ్నించారు. లెక్కలు అడగడానికి మీరెవరు అని ప్రశ్నించడంతో.. వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో ప్రైవేట్ వ్యక్తులతో పనులు ఎందుకు చేయిస్తున్నారని సర్పంచ్‌ను ప్రశ్నించగా.. ఆయన వారినే అడగాలని ఎదురు చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. వార్డు సభ్యులుగా ఉండి ప్రైవేట్ వ్యక్తులను అడిగితే సిగ్గుచేటని వారు వాపోయారు.
ఇదీ చూడండి:-'భారత్-చైనా మధ్య మరొకరి జోక్యం అవసరం లేదు'
Last Updated : Jul 25, 2020, 7:05 PM IST