నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని బంగాల్ పేట్, నాగ్ నాయిపేట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ ముషారఫ్ షారుఖీ పరిశీలించారు. రహదారులు భవనాలశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బంగాల్ పేట్ సమీపంలో 444, నాగ్ నాయి పేట్ సమీపంలో 1,014 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు.
నిర్మాణంలో ఉన్న రెండుపడక గదుల ఇళ్లను పరిశీలించి నిర్మల్ కలెక్టర్ - latest news of nirmal
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలోనున్న రెండు పడకగదుల ఇళ్ల పురోగతిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
నిర్మాణంలో ఉన్న రెండుపడక గదుల ఇళ్లను పరిశీలించి నిర్మల్ కలెక్టర్
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. అధికారులు సమన్వయంతో ప్రతి రోజు పనులను పర్యవేక్షించి పూర్తి చేయుటకు కృషి చేయాలని సూచించారు.
TAGGED:
latest news of nirmal