భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ కోరారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించుకొని... 1949 నవంబర్ 26న ఆమోదించుకున్నామని ఆయన గుర్తు చేశారు. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగంలో పౌరులందరికీ సమాన హక్కులు, సమన్యాయం కల్పించుకున్నామని పేర్కొన్నారు.
ప్రజలందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ సమానత్వంతో ఎదిగేందుకు... భావప్రకటన స్వేచ్ఛను పొందేందుకు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. అన్ని కులాలు, మతాలు ఐక్యతతో ఉండేందుకు, జాతీయ సమగ్రతను పరిరక్షించే విధంగా రాజ్యాంగం రూపొందించారని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.