నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్.రాములు అనారోగ్యంతో మృతి చెందారు. సోన్ గ్రామానికి చెందిన ఆయన.. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు.
నిర్మల్ జిల్లాలో అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి - సోన్ గ్రామం వార్తలు
నిర్మల్ జిల్లా సోన్ గ్రామానికి చెందిన ఓ కానిస్టేబుల్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.
కానిస్టేబుల్ మృతి, నిర్మల్ జిల్లా, సోన్
రాములు మృతి పట్ల సోన్ సర్కిల్ సీఐ జీవన్ రెడ్డి, స్థానిక ఎస్ఐ అహ్మద్ ఆలీ, స్టేషన్ సిబ్బంది ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. యువ కానిస్టేబుల్ మృతి చెందడం వల్ల సోన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.
ఇదీ చూడండి:వివాహం కావట్లేదని యువకుడు మృతి