తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రిలో కరోనా బాధితులకు భోజనం పంపిణీ

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు కాంగ్రెస్ పార్టీ భోజనం పంపిణీ చేసింది. రాజీవ్​గాంధీ వర్ధంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టింది.

food distribution
food distribution

By

Published : May 21, 2021, 5:28 PM IST

రాజీవ్​గాంధీ వర్ధంతి పురస్కరించుకుని యువజన కాంగ్రెస్ పార్టీ, ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు భోజనం పంపిణీ చేశారు.

ఐటీ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చిన ఘ‌న‌త రాజీవ్ గాంధీకే ద‌క్కుతుందని, స‌మ‌స‌మాజ స్థాప‌న కోసం చేసిన కృషి ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్ మొహమ్మద్ ఇమ్రాన్ ఉల్లాహ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు జునైద్ మెమన్, పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను, మైనార్టీ యూత్ జిల్లా అధ్యక్షులు ఎండీ ఉమర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పర్యావరణ ఉద్యమకారుడు బహుగుణ మృతి

ABOUT THE AUTHOR

...view details