అకారణంగా రైతుల ఖాతాల నుంచి ధాన్యం డబ్బుల చెల్లింపులో కోతలు విధిస్తున్నారంటూ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కోత విధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేపట్టే ప్రయత్నం చేసిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. రైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధించారని, మిల్లుల్లోనూ ధాన్యానికి వంకలు పెట్టి అక్కడా కోతలు విధించడంతో అన్నదాతలు ఎంతో నష్టపోయారన్నారు.
'రైతుల ఖాతాల్లోని ధాన్యం సొమ్ములో కోతలు ఎందుకో చెప్పాలి' - నిర్మల్ జిల్లా వార్తలు
నిర్మల్ జిల్లా దిలావర్పూర మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అకారణంగా రైతుల ఖాతాల నుంచి ధాన్యం డబ్బుల చెల్లింపులో కోతలు విధించారని నిరసన తెలిపారు. వెంటనే కోత విధించిన డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమచేయాలని... లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.
'రైతుల ఖాతాల్లోంచి కోతలు విధించిన డబ్బులను వెంటనే చెల్లించాలి'
ఖాతాల్లో డబ్బులు పడ్డాక ప్రతి రైతు ఖాతా నుంచి 5 నుంచి 20 వేల వరకు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. అప్పటికే నష్టపోయామని బాధలో ఉన్న రైతులపై మళ్లీ ఈ కోతలు ఏంటని ప్రశ్నించారు. అసలు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరముందన్నారు. వెంటనే కోతలు విధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయాలని లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు.
ఇవీ చూడండి:కరీంనగర్ కుర్రాడి సరికొత్త ఆవిష్కరణ.. కల్లాల్లో ధాన్యం ఇక భద్రం