ఆశ్రమం పాఠశాలలో భోజనం బాగాలేదు అన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారంటూ నందకిశోర్ అనే విద్యార్థి నిర్మల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. నిర్మల్ జిల్లా రాణాపూర్లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నందకిశోర్ ఇవాళ భోజనం నాణ్యతగా లేదని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న వసతిగృహం సంక్షేమాధికారి ఆగ్రహంతో... సహచర విద్యార్థులతో తనపై దాడి చేయించాడని నందకిశోర్ ఆరోపించాడు. తోటి విద్యార్థుల దాడిలో కన్నుపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపాడు. విద్యార్థి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు.
అన్నం బాలేదన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారు - Conflict between students in a government tribal ashram school
నిర్మల్ జిల్లా రాణాపూర్లోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది. భోజనం సరిగా లేదని అన్నందుకు సహచర విద్యార్థులు తనపై దాడి చేశారని నందకిశోర్ అనే బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అన్నం బాలేదన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారు