తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్​పై ఆగ్రహం - జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు

నిర్మల్​ జిల్లా ముథోల్​లోని జిల్లా పరిషత్​ సెకండరీ బాలికల పాఠశాలను జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణం అపరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రిన్సిపల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం చేపట్టి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు.

కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్​పై ఆగ్రహం

By

Published : Nov 16, 2019, 8:28 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో ఉన్న అపరిశుభ్రతను చూసి ప్రిన్సిపల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పాఠశాల ఆవరణ ఇంకోసారి అపరిశుభ్రతగా కనిపిస్తే ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకుని మెమోలు జారీ చేస్తానని హెచ్చరించారు. స్థానిక నాయకులు పాఠశాల కొత్త భవనం గురించి కలెక్టర్​కు విన్నవించగా.. నిధులు మంజూరు అయ్యేటట్లు చూస్తామని ఆమె తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.

కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్​పై ఆగ్రహం

ఇదీ చూడండి: విద్యార్థులు ఇద్దరు.. అయ్యవార్లు అసలే లేరు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details