మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో మిడతలను అదుపు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.జిల్లాలో మిడతల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో మిడతలు ఉన్నాయని, అవి ఏ సమయంలోనైనా తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు.
'మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలి'
నిర్మల్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ డివిజన్లలో ప్రతి డివిజన్‌కు ఒక ఫైర్ ఇంజన్, 5 ట్యాంకర్ల చొప్పున నీటిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మిడతలపై పిచికారీ చేసే మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలుగా వ్యవసాయ శాఖ అధికారులను నియమించాలన్నారు. అధికారులందరు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని, సమస్యను ఎదుర్కొనేందుకు పగలు,రాత్రి అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి శరత్ కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పక్షుల దాహం తీరుస్తున్న కొత్త ఆలోచన