పచ్చదనం పెంపుకోసం హరితహారంలో విరివిగా మొక్కలు నాటి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రామాల వారీగా పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పల్లెప్రకృతి వనాల ఏర్పాట్లకు ప్రతి గ్రామం దగ్గరలో ఎకరం భూమిని శుక్రవారంలోగా సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు.