అర్హులైన ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును విధిగా నమోదు చేసుకునే విధంగా అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వందశాతం ఓటు నమోదు జరగాలి: కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ
అర్హులైన ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సూచించారు. రాష్ట్రస్థాయి సగటు కంటే జిల్లాలో తక్కువ ఓటర్ శాతం నమోదు అయినందున దానిని పెంచేలా అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి.. ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. నిర్మల్ లో 73 శాతం, భైంసా లో 67 శాతం, ఖానాపూర్ లో 66 శాతం ఓటరు నమోదు జరిగిందన్నారు. రాష్ట్రస్థాయి సగటు కంటే జిల్లాలో తక్కువ నమోదు అయినందున, వందశాతం ఓటర్ నమోదు చేయించేలా బూత్ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. ఓటరు జాబితాలో పేరు, చిరునామా తదితర తప్పులు ఉంటే సరిచేసుకోవాలని తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.