తెలంగాణ

telangana

ETV Bharat / state

వృద్ధుల కోసం 'ఆలన వాహనం' ప్రారంభం - collector Musharraf latestnews

నిర్మల్‌ జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు వైద్యచికిత్సలు అందేంచేందుకే ఆలన వాహనం ప్రారంభించారు. ఇంటిపట్టునే ఉంటున్నా వయోవృద్ధులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు కలెక్టర్‌ ముషర్రఫ్‌ తెలిపారు.

వృద్ధుల కోసం 'ఆలన వాహనం' ప్రారంభం
వృద్ధుల కోసం 'ఆలన వాహనం' ప్రారంభం

By

Published : Jul 2, 2020, 5:17 PM IST

నిర్మల్‌ జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు అవసరమైన ప్రత్యేక వైద్య చికిత్సలందించేందుకు ఆలన వాహనాన్ని ప్రవేశపెట్టారు. గురువారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలన వాహనాన్ని కలెక్టర్‌ ముషర్రఫ్‌ ఫారూఖీ జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటున్నా వయోవృద్ధులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలన వాహనాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వాహనంలో వైద్యుడితో పాటు ఏఎన్ఎం, సిబ్బంది ఉంటారన్నారు. ప్రతి గ్రామంలో పక్షవాతం, టీబీ వంటి ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్సలు అందిస్తారని పేర్కొన్నారు.

ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details