నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ముషర్రఫ్ షారూఖీ అధికారులను ఆదేశించారు. ఖానాపూర్ మండలం ఇక్బల్ పూర్లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం, శెగ్రిగేషన్ షెడ్డు, కడెం మండలం నర్సాపూర్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ - నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
నిర్మల్ జిల్లాలో చేపట్టిని వివిధ రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ షారుఖీ అధికారులను ఆదేశించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని ఆయన పర్యటించారు.
![అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ collector musharraf sharukhi visit khanapur constituency villages in nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8739402-120-8739402-1599651374316.jpg)
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: కలెక్టర్
పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన వివిధ రకాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల్లో పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు. సీజినల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పనుల పురోగతిని ప్రతి రోజు పర్యవేక్షించాలని సూచించారు.
ఇదీ చదవండి:ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్